కలం వెబ్ డెస్క్ : నేడు దుబాయ్(Dubai)లోని ఐసీసీ(ICC) అకాడమీ గ్రౌండ్ వేదికగా అండర్-19 ఆసియా కప్ ఫైనల్స్(Under 19 Asia Cup Finals) జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్(India) జట్టు, పాకిస్తాన్(Pakistan) జట్టుతో తలపడనుంది. ఉదయం 10:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. కెప్టెన్ ఆయుష్ మాథ్రే(Ayush Mhatre) నేతృత్వంలో భారత జట్టు టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచిన భారత్, గ్రూప్ దశలోనే పాకిస్తాన్‌ను 90 పరుగుల భారీ తేడాతో ఓడించింది. సెమీఫైనల్‌లో శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరోవైపు పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. గ్రూప్ దశలో భారత్ చేతిలో ఓటమి పాలైనా, పాక్ టీం స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు 8 సార్లు కప్ కొట్టిన భారత్ తొమ్మిదో విజయం కోసం సిద్ధంగా ఉంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Read Also: సీతాఫలం ఎంత అండర్‌రేటెడ్ ఫ్రూటో తెలుసా?
Follow Us On: Sharechat


