కలం మెదక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ మహిళా (Mahila Congress Protest) ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో నిరసన తెలిపారు. బీజేపీ ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం వల్ల మధ్యతరగతి ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రం ముస్తాబాద్ చౌరస్తాలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మీ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజలను చిన్న చూపు చూస్తూ వారి సొమ్మును అదానీ, అంబానీలకు దోచి ఇస్తుందని తీవ్రంగా ఆరోపించారు. సామాన్యులకు న్యాయం చేయాలని, పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులు కవిత, రజిని, సంతోష, సన పలువురు పాల్గొన్నారు.

