కలం మెదక్ బ్యూరో: తెలంగాణ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పండ్ల తోటల విస్తీర్ణం పెంపు కోసం రైతులకు అనేక ప్రోత్సాహక పథకాలు అందుబాటులో ఉన్నాయని , రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఉద్యాన పంటల సాగు విస్తరణ ద్వారా అధిక ఆదాయం పొందాలని రాష్ట్ర హార్టికల్చర్ శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాష (Horticulture Director) సూచించారు. సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రంలో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలకు ప్రారంభించి, మామిడి ప్రదర్శనను పరిశీలించారు. రైతులు ఆధునిక సాంకేతిక పద్ధతులను అనుసరిస్తూ నాణ్యమైన మామిడి పండ్ల ఉత్పత్తి చేపడితే విదేశాలకు ఎగుమతులు చేసి అధిక లాభాలు పొందవచ్చన్నారు.

