Mobile Popup Ad
Mobile Popup Ad

పవన్ కళ్యాణ్ బీజేపీ ఆడిస్తున్న తోలుబొమ్మ : మహేశ్ కుమార్ గౌడ్

కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పై చేసిన విమర్శలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud)  కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ బీజేపీ ఆడిస్తున్న తోలుబొమ్మ అని ఆరోపించారు. బీజేపీ పలికించేవే పవన్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. గతంలో తెలంగాణను వ్యతిరేకిస్తూ మోదీ, అమిత్ షా చేసిన పలుకులనే పవన్ కళ్యాన్ రిపీట్ చేస్తున్నాడని తెలిపారు. తెలంగాణకు రావొద్దని పవన్ కళ్యాణ్ ను ఎవరూ ఆపడం లేదని చెప్పారు. ఓ సినిమా నటుడిగా పవన్ కళ్యాణ్ వస్తే ఇంటికి పిలిచి భోజనం పెడతానని తెలియజేశారు. అయితే జూన్ 2న తెలంగాణకు వచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తానంటే ఎలా? అని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ విభజించిన తీరును వ్యతిరేకించానని.. కాంగ్రెస్ తీరు ఇప్పటికీ మారలేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడంపై మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.కాంగ్రెస్ చరిత్ర గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదన్నారు. కాంగ్రెస్ గురించి మాట్లాడాలంటే ముందు దేశం కోసం గాంధీ, నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు చేసిన త్యాగాలను తెలుసుకోవాలని సూచించారు.సోనియా గాంధీ ఇవ్వకుంటే తెలంగాణ వచ్చేది కాదని చెప్పుకొచ్చారు. పవన్ చాలా చిన్నవాడు, రాజకీయాల్లో ఇంకా చాలా నేర్చుకోవాలని సూచించారు. ఇది సినిమా కాదు, సినిమా డైలాగులు మాట్లాడితే కుదరదని పవన్ కళ్యాణ్ ను హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>