కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ మండలంలో నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క (Seethakka), టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని లబ్ధిదారులకు నూతన పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులతో వారు మాట్లాడారు.
అర్హులైన పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హత కలిగిన వర్గాలకు సామాజిక భద్రత కల్పించడంలో పింఛన్లు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి సీతక్క, మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులు ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
Also Read : మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. పేరేంటంటే?
Follow Us On : WhatsApp

