కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫుట్ బాల్ అభిమానులకు ఆసక్తికరమైన వార్త చెప్పారు. ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo)ను తెలంగాణకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో ఏబీపీ టీవీ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. గత డిసెంబర్ లో లియోనల్ మెస్సీ హైదరాబాద్ పర్యటించిన నేపథ్యంలో ఈసారి రొనాల్డోను కూడా రాష్ట్రానికి రప్పించే ఆలోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలోనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని రేవంత్ రెడ్డి చెప్పారు. రొనాల్డోను ఎప్పుడు తీసుకురావాలి? దీనికి ఎంత సమయం పడుతుంది? అనే అంశాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. రొనాల్డో పర్యటనకు సంబంధించిన తేదీలు కూడా ఖరారు కావాల్సి ఉందని సీఎం పేర్కొన్నారు.
Also Read : రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది : హరీశ్ రావు
Follow Us On: Youtube

