ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

కలం, జడ్చర్ల: అర్హులైన పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, ఆడపిల్లల వివాహాలకు అండగా నిలుస్తోందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) అన్నారు. శనివారం జడ్చర్ల మున్సిపాలిటీలోని అంబేద్కర్ కళాభవన్‌లో జడ్చర్ల పట్టణం, మండలానికి చెందిన 92 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నర్సింగ్ రావు, మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ కోనేటి పుష్పలత, పార్టీ నాయకులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>