యువతి సూసైడ్ కేసులో నలుగురు అరెస్టు

కలం, బూర్గంపహాడ్: ప్రియుడు ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురై యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. శ‌నివారం వారిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు బూర్గంపహాడ్ (Bhurgampahad) ఎస్సై ప్రసాద్ తెలిపారు. ​వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం చెరువు సింగారం గ్రామానికి చెందిన చర్ప కవిత (20) అనే యువతిని అదే గ్రామానికి చెందిన సున్నం చరణ్ ప్రేమించాడు. కొద్ది రోజులుగా పెళ్లి ప్ర‌స్తావ‌న తీసుకురాగా పెళ్లికి నిరాకరించాడు. దీంతో క‌విత‌ తీవ్ర అవమానభారానికి గురైంది.

ఈ క్రమంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భద్రాచలంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్ర‌వారం ఉదయం మృతి చెందింది. కాగా ​మృతురాలి తండ్రి రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్ర‌వారం పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. యువ‌తిని ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించిన‌ సున్నం చరణ్‌తో పాటు అతనికి సహకరించిన తల్లిదండ్రులు లక్ష్మయ్య, జ్ఞానమణి, అన్నయ్య అరుణ్‌లను నేడు అరెస్టు చేసి, అనంతరం జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై ప్రసాద్ వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>