ఇందిరా బీమాతో పేద కుటుంబాలకు అండ: మేఘారెడ్డి

కలం, వనపర్తి: కుటుంబ పెద్దను కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే మేఘారెడ్డి (MLA Megha Reddy) అన్నారు. శనివారం పెద్దగూడెం గ్రామం నుంచి జిల్లావ్యాప్తంగా పథకం నమోదు ప్రక్రియను కలెక్టర్ ఆదర్శ్ సురభి, డీసీసీ అధ్యక్షుడు శివసేన రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలతో పాటు నామినీ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. కుటుంబ పెద్ద మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందుతుందని తెలిపారు.

35 వేల కొత్త రేషన్ కార్డులు మంజూరు..

వనపర్లి జిల్లాలోని 268 గ్రామపంచాయతీలు, 80 మున్సిపల్ వార్డుల్లో నమోదు ప్రక్రియ ప్రారంభమైనట్లు ఎమ్మెల్యే మేఘారెడ్డి వెల్లడించారు. వనపర్తి నియోజకవర్గంలో సుమారు 35 వేల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నియోజకవర్గానికి 5,500 ఇళ్లు, పెద్దగూడెంకు 62 ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. అనంతరం ఐదు కుటుంబాలకు బీమా నమోదు పత్రాలను అందజేశారు. మున్సిపల్ ఛైర్మన్లు మాధవి, శ్రీనివాస్ గౌడ్, వైస్ ఛైర్మన్ మధుసూదన్ గౌడ్, సర్పంచి పుష్పలత పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>