యాదాద్రి లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న ఐఏఎస్ పమేలా సత్పతి

కలం, యాదగిరిగుట్ట : తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్, గతంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా సేవలందించిన ఐఏఎస్ అధికారి శ్రీమతి పమేలా సత్పతి (IAS Officer Pamela Satpathy) శనివారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఆమెకు దేవస్థానం అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.

అనంతరం ఫోటో జర్నలిస్ట్ గుజ్జ నరేష్ ఆహ్వానం మేరకు యాదగిరిగుట్టలోని ట్రెండీ గిఫ్ట్ స్టోర్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా నరేష్ ఆమెకు ఆత్మీయ స్వాగతం పలికి, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ప్రతిమను జ్ఞాపికగా అందజేశారు. గతంలో జిల్లా కలెక్టర్‌గా యాదాద్రి భువనగిరి జిల్లాలో సేవలందించిన పమేలా సత్పతి తిరిగి యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించడం, స్థానిక ఫోటో జర్నలిస్ట్ ఆహ్వానాన్ని మన్నించి ఆయన నిర్వహిస్తున్న గిఫ్ట్ స్టోర్‌ను సందర్శించడం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>