కలం, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసి(Varanasi) మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీకి సంబంధించి ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. గత సినిమాల కంటే ఈమూవీని రాజమౌళి(Rajamouli) భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియాతో పాటు, ఈ చిత్రం అంతర్జాతీయంగా విడుదల కాబోతుండటం మరో హైలైట్. అయితే ఇప్పుడు వారణాసి మూవీకి మహేశ్ ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారనే విషయమై టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.
మహేష్ బాబు (Mahesh Babu) సాధారణంగా ఒక్కో చిత్రానికి రూ. 70 కోట్లు తీసుకుంటాడు. వారణాసి కోసం రూ. 150 కోట్లకుపైగా తీసుకోబోతున్నాడని తెలుస్తోంది. మహేశ్ మాత్రం రూ. 150-175 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ఒకవేళ షూటింగ్ ఆలస్యమైతే రెమ్యూనరేషన్ పెంచే అవకాశాలున్నాయి. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా రూ. 30 కోట్ల పారితోషికం తీసుకుంటోంది. 2024 సంక్రాంతికి గుంటూరు కారంతో అలరించిన మహేష్ వెంటనే వారణాసి మూవీకి మేకోవర్ అయ్యాడు. ఈ చిత్రం మార్చి 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది.
Read Also: చిరంజీవితో అనిల్ రావిపూడి ప్రయోగాలు.. అవసరమా..?
Follow Us On: Facebook


