కలం, సినిమా : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) ఏషియన్ సినిమాస్‌తో భాగస్వామ్యంగా హైదరాబాద్‌లో ప్రారంభించిన ఏఎంబి (AMB) సినిమాస్ మల్టీప్లెక్స్ అత్యాధునిక సాంకేతికత, ప్రీమియం క్వాలిటితో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా కర్ణాటక రాజధాని బెంగుళూరులో కూడా ఏఎంబి మాల్ (AMB Mall) ప్రారంభం అయింది. ఈ మల్టీప్లెక్స్‌ను జనవరి 16న ఘనంగా ప్రారంభించనున్నట్లు మహేశ్‌బాబు అధికారికంగా ప్రకటించారు.
నేడు కపాలిలో ఏఎంబీ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం మహేశ్‌బాబును చూడడానికి జనం ఎగబడ్డారు. జనం కిక్కిరిసిపోవడంతో తోపులాట జరిగింది. ఒక దశలో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. అతి కష్టం మీద పోలీసులు మహేశ్‌బాబును సురక్షితంగా లోపలికి తీసుకెళ్ళారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి డాల్బీ సౌండ్ సిస్టమ్‌తో ఒకే ప్రాంగణంలో తొమ్మిది సినీ థియేటర్లతో రూపుదిద్దుకున్న కపాలిలోని ఏఎంబీ మాల్ మొదటిది.


