కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఒకవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నాడు. ఈ హీరో ఇప్పటికే హైదరాబాద్‌లో AMB పేరిట మల్టీప్లెక్స్‌ను (AMB Multiplex) నడుపుతున్నాడు. అభిమానులు, సెలబ్రిటీలు సైతం ఈ మల్టీపెక్స్‌లో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ మల్టీపెక్స్ ఊహించనిదానికంటే సక్సెస్ కావడంతో మహేశ్ బెంగళూరులో మల్టీప్లెక్స్‌ను ప్రారంభించబోతున్నాడు.
బెంగళూరులోని (Bengaluru) జనవరి 16న ప్రారంభమవుతుందని ఈ స్టార్ వెల్లడించాడు. బెంగళూరులోని గాంధీ నగర్‌లోని AMB అత్యాధునిక ఫీచర్స్‌తో ప్రారంభంకాబోతోంది. ’ఏఎంబి సినిమాస్‌లో (AMB Multiplex) దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి డాల్బీ అనుభవంతో రాబోతోంది. ఇలాంటి అత్యాధునిక ఫీచర్స్ తీసుకురావడానికి నా టీమ్ ఎంతో శ్రమించింది. నమ్మ బెంగళూరులో మీ అందరినీ అతి త్వరలో చూడాలని ఎదురుచూస్తున్నా‘ అని ఇప్పటికే మహేష్ బాబు తెలిపాడు.
Read Also: చలికాలంలో బాదం ఎందుకు తినాలో తెలుసా!
Follow Us On: Sharechat


