కలం వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని పాతబస్తీలో (Old City) ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడం కలకలం రేపింది. పురానాపూల్‌లో (Purana Pul) బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు వర్గాల యువకులు రోడ్డు మీదకు వచ్చి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కానీ, ఘర్షణ తీవ్రస్థాయికి చేరడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో కొందరు పోకిరీలు తిరిగి పోలీసులపైనే దాడి చేశారు. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఒక వర్గానికి చెందిన యువకులు రోడ్డుపై పెట్రోల్ పోసి బైక్ తగులబెట్టి నినాదాలు చేశారు. ఘర్షణ నేపథ్యంలో బహదూర్ పుర నుంచి పురానాపూల్ వెళ్లే రోడ్డును పోలీసులు బ్లాక్ చేశారు. ఇరువర్గాలను చెదరగొట్టి అర్ధరాత్రి నుంచి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Read Also: 75 దేశాలకు వీసా జారీ నిలిపివేసిన అమెరికా.. మరి ఇండియా!
Follow Us On: Sharechat


