Mobile Popup Ad
Mobile Popup Ad

నాగార్జునసాగర్ ను సందర్శించిన మహారాష్ట్ర ఎన్నికల కమిషనర్

కలం, నాగార్జునసాగర్: అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ (Nagarjunasagar) ను శనివారం నాడు మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దినేష్ వామరే కుటుంబ సమేతంగా సందర్శించారు. శుక్రవారం హైదరాబాదులో ఈవీఎంల (EVM) తయారీ సంస్థ ఈసీఐఎల్ ఉన్నతాధికారులతో మహారాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యదర్శి సురేష్ కాకాని తో కలిసి సమావేశమయ్యారు. సాగర్ సందర్శనలో భాగంగా విజయ విహార్ అతిథి గృహానికి చేరుకున్న వీరికి తిరుమలగిరి సాగర్ తాసిల్దార్ అనిల్ కుమార్, ప్రోటోకాల్ ఆర్ఐ దండ శ్రీనివాస్ రెడ్డి, విజయ విహార్ మేనేజర్ కిరణ్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం టూరిజం లాంచీలో నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించారు. నాగార్జునకొండ పై పునర్ నిర్మించిన సింహాల విహారము, అశ్వమేధ యజ్ఞశాల, మహాస్తూపాన్ని వీక్షించారు.

అనంతరం బుద్ధవనం చేరుకొని బుద్ధ పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. బుద్ధవనం సందర్శనలో భాగంగా బుద్ధ చరితవనం, జాతకవనం, ధ్యానవనం, స్తూపవనాలను సందర్శించి మహాస్తూపం లోని సమావేశ మందిరంలో బుద్ధ వనం విశేషాలు తెలిపే లఘు చిత్రాలను చూశారు. అనంతరం మహాస్థూపంలోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతులను వెలిగించారు. వీరికి బుద్దవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్రులు సత్కరించారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జున కొండ (Nagarjunasagar), బుద్ధవనం చారిత్రక విశేషాలను వివరించారు. వీరితోపాటు , ఈసీఐఎల్ సంస్థ ప్రతినిధి సౌరబ్, లైజనింగ్ ఆఫీసర్లు సుధీర్ రెడ్డి, పాండు, అభిషేక్, స్థానిక ఎస్సై ముత్తయ్య తదితరులు ఉన్నారు.

Read Also: జనగామలో ఉద్యోగాల జాతర.. అర్ధరాత్రి మెసేజ్‌లు, మరుసటి రోజే పరీక్ష!

Follow Us On: Pinterest

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>