షాకింగ్.. ఓలా షోరూంలో ఎలక్ట్రిక్ బైకులు దగ్ధం

కలం, వెబ్ డెస్క్: ఖమ్మం (Khammam) ఓలా షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు ఎలక్ట్రిక్ బైక్ (OLA Bikes) లు పూర్తిగా బూడిదయ్యాయి. పేలుడు శబ్దంతో మంటలు భారీగా ఎగిసిపడడంతో సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటన వల్ల ఎంత ఆస్తి నష్టం జరిగిందనే అంశం ఇంకా తెలియరాలేదు. మంటలకు చార్జింగ్ కారణమా? షార్ట్ సర్క్యూట్ వల్లనా ప్రమాదం జరిగిందా? అనే కోణాల్లో అధికారులు విచారణ చేస్తున్నారు.

కాగా, ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ బైకుల బ్యాటరీల వల్ల అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఛార్జింగ్ సమయంలో, తరచుగా బ్యాటరీల ఓవర్ హీటింగ్ వల్ల షార్ట్ సర్క్యూట్‌లు జరిగి వాహనాలు (OLA Bikes) పూర్తిగా దగ్ధమవుతున్న ఘటనలను చూస్తున్నాం. అలాంటిది ఏకంగా షోరూంలోనే ఎలక్ట్రిక్ బైకుల దగ్ధం జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

Read Also: మోదీని గద్దె దించడమే నా ప్రధాన లక్ష్యం : మమతా బెనర్జీ

Follow Us On: Facebook

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>