బైక్‌పై అసెంబ్లీకి దేవేంద్ర ఫడ్నవీస్.. వీడియో వైరల్

కలం, వెబ్ డెస్క్: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ఇంధన పొదుపుపై అవగాహన కల్పించేందుకు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు, పెరిగిపోతున్న ఇంధన ధరలు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని, ఆయన బుల్లెట్‌పై (Bullet) అసెంబ్లీకి చేరుకున్నారు. ఇందుకోసం ఆయన తన భారీ కాన్వాయ్‌ను పక్కకు పెట్టారు. గురువారం ఉదయం ముంబైలోని తన నివాసం నుంచి విధాన భవన్ వరకు ఆయన బుల్లెట్ పై ప్రయాణించారు. ఫడ్నవీస్ వెంట సాంస్కృతిక శాఖ మంత్రి ఆశిష్ షెలార్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజలందరూ సాధ్యమైనంత వరకు ఇంధనాన్ని ఆదా చేయాలన్నారు. విలాసాల కంటే పొదుపు ముఖ్యమని సందేశమిచ్చారు. ముఖ్యమంత్రితోపాటు ఆయన భద్రతా సిబ్బంది కూడా ద్విచక్ర వాహనాలపైనే జర్నీ చేయడం విశేషం.

Read Also: ’వందేమాతరం‘పై బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>