Mobile Popup Ad
Mobile Popup Ad

‘పెద్ది’ పవర్‌ప్లే టూర్.. భారీ ప్రమోషన్స్ షురూ

కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చి బాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పెద్ది” (Peddi). జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను మేకర్స్ భారీగా ప్లాన్ చేశారు. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన ‘పెద్ది పవర్‌ప్లే టూర్’ (Peddi Powerplay Tour) ప్లాన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మే 18న ముంబైలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఆ తరువాత మే 22న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌కి పెద్ది టీం రానుంది.

మే 23న భోపాల్, 24న బెంగళూరు, 28న ఢిల్లీ, 30న చెన్నై, జూన్ 1న విజయనగరం, 2న హైదరాబాద్ నగరాలలో పెద్ది టీం ప్రత్యేక ప్రమోషనల్ ఈవెంట్‌లు నిర్వహించనున్నారు. జూన్ 4 విడుదల లక్ష్యంగా చిత్ర యూనిట్ ఇప్పటికే భారీ ప్లానింగ్‌తో ముందుకు వెళ్తోంది. వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఎంతో కష్టం, శ్రద్ధ పెట్టినట్లు టీమ్ వెల్లడించింది. ‘ఇది కేవలం ఆరంభం మాత్రమే.. ఇంకా ఎన్నో సర్‌ప్రైజ్‌లు రాబోతున్నాయి’ అని పెద్ది టీం పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>