కలం, వెబ్ డెస్క్: సంక్రాంతి (Sankranti) పండుగ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ 6,400 ప్రత్యేక బస్సులు నడపనుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని భారీ స్థాయిలో రవాణా ఏర్పాట్లు చేసింది. నాలుగు రోజులపాటు మొత్తం 6,400 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రయాణ సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లోని ఇమ్లీబన్ బస్టాప్, జూబ్లీ బస్‌స్టేషన్ (జేబీఎస్), ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్‌బీనగర్ బస్టాప్‌ల నుంచి ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
మొత్తం 6,400 ప్రత్యేక బస్సుల్లో 5,400 బస్సులు మహాలక్ష్మి (Mahalakshmi) పథకం కింద నడపనున్నారు. ఈ పథకం ప్రకారం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. దీంతో పండుగకు తమ స్వగ్రామాలకు వెళ్లే వేలాది మంది మహిళా ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది. ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ శ్రీలత మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ రద్దీ సమయంలో ప్రయాణికులకు సురక్షితమైన సేవలు అందించేందుకు ఆర్టీసీ శాఖ పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు.

Read Also: టికెట్ రేట్స్ విషయంలో ప్రభుత్వానికే క్లారిటీ లేదా?
Follow Us On: Twitter


