epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

టికెట్ రేట్స్ విషయంలో ప్రభుత్వానికే క్లారిటీ లేదా?

కలం, సినిమా :  తెలంగాణలో కొత్త సినిమా టికెట్ రేట్స్ పెంపు (Ticket Price Hike) అంశం విమర్శలకు దారితీస్తుంది. ఒక సినిమాకు టికెట్ రేట్స్ పెంచడం మరో సినిమాకు టికెట్ రేట్స్ పెంచకపోవడం ప్రేక్షకులను అసహనానికి గురి చేస్తుంది. అయితే గతంలో సినిమా టికెట్ రేట్స్ పెంపు ఇక ఉండదని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. పుష్ప 2 మూవీ ఘటన తరువాత, తెలంగాణలో పెద్ద సినిమాల ప్రీమియర్ షోస్, టికెట్ రేట్స్ పెంపు విషయంలో గందరగోళం నెలకొంది. టికెట్ రేట్స్ పెంపు ఉండదు అని ప్రకటిస్తూనే అధికారులు అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఇటీవల నందమూరి బాలకృష్ణ నటించిన ” అఖండ 2″  సినిమాకు టికెట్ రేట్స్ పెంపుకు అనుమతి ఇవ్వగా హైకోర్ట్ ఆదేశాలతో అనుమతులు నిరాకరించారు.

తనకు తెలియకుండానే అధికారులు అనుమతులు ఇచ్చారంటూ ఇక మీదట ఏ సినిమాకు టికెట్ రేట్స్ పెంపునకు అనుమతి ఇవ్వబోమని మీడియా ముందు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkat Reddy) చెప్పుకొచ్చారు. టికెట్ రేట్స్ విషయంలో నెలకొన్న గందరగోళం కారణంగా ప్రభాస్ నటించిన ” ది రాజాసాబ్ ” (The RajaSaab) సినిమాకి అర్ధరాత్రి అయినా జీవో రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. ఇకపై ఏ సినిమాకు టికెట్ రేట్స్ పెంచవద్దని తెలంగాణ హైకోర్ట్ కూడా ఆదేశించింది. అయితే ఆ మరుసటి రోజే చిరంజీవి మూవీ ” మన శంకర వరప్రసాద్ ” సినిమాకు రేట్లు పెంచుతూ (Ticket Price Hike) జీవో వచ్చింది.

ఒకే రోజు రెండు సినిమాల మెమోలు తయారు చేసినా కూడా, ప్రభాస్ సినిమా మెమోను చివరి వరకూ ఇవ్వకుండా తరువాత విడుదల చేయడం, చిరంజీవి సినిమాకి 10వ తేదీన మెమో విడుదల చేయడం వంటివి అనుమానాలకు తావిస్తుంది. చిరంజీవి సినిమా మెమో విడుదల కాకపోవడంతో అప్పటికే విడుదలైన ప్రభాస్ సినిమా జీవోపై మాత్రమే కోర్టులో స్టే రావడం.. సంక్రాంతి సందర్భంగా కోర్టుకు సెలవుల కారణంగా చిరంజీవి సినిమా మెమో మీద స్టే లేకపోవడం, మన శంకర వరప్రసాద్ సినిమాకు ఫేవర్ చేసేందుకే  రాజాసాబ్ సినిమాను బలి చేశారని నెటిజెన్స్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.

Read Also: యాక్షన్ లుక్‌తో వచ్చేసిన ఘట్టమనేని జయకృష్ణ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>