కలం, వెబ్‌డెస్క్: మహబూబ్‌నగర్(Mahabubnagar) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. దివిటిపల్లి సమీపంలోని జాతీయ రహదారి – 44పై సోమవారం తెల్లవారుజామున వేగంగా వస్తున్న డీసీఎం వ్యాన్ అదుపుతప్పింది. ఎదురుగా వస్తున్న కారు, ఆటోపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదం సమయంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అప్రమత్తమై వాహనం నుంచి దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే కారు మాత్రం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. ఆటో కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. డీసీఎం వ్యాన్ బోల్తా పడటంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Mahabubnagar | సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్రేన్ సహాయంతో దెబ్బతిన్న వాహనాలను పక్కకు తొలగించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమంగా పునరుద్ధరించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: నేడు SPB విగ్రహావిష్కరణ.. రవీంద్రభారతిలో టెన్సన్ టెన్షన్
Follow Us On: X(Twitter)


