కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) తీర ప్రాంతాలెన్నో ఉన్నాయి. ఈ కారణంగానే వ్యవసాయం, పండ్లు, చేపల ఉత్పత్తిలో ఏపీ కీలకంగా వ్యవహరిస్తోంది. ఇక్కడ సాగుయ్యే కొన్ని పంటలు విదేశాలకు తరలివెళ్తాయి. అందుకే వ్యవసాయం, మత్స్య సంపదలో సహా అనేక రంగాల్లో ఏపీ అగ్రస్థానాలను దక్కించుకుంది. భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజా నివేదికలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని తెలిపింది. ఇది రాష్ట్ర ఆర్థిక, సామాజిక పురోగతిని తెలియజేస్తోంది.
“ఆంధ్రప్రదేశ్ 19 మిలియన్ టన్నులకుపైగా పండ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. దాదాపు 5.1 మిలియన్ టన్నుల చేపల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది” అని ఆర్బీఐ తెలిపింది. రాష్ట్రం స్థిరమైన ఆర్థిక వృద్ధిని కూడా నమోదు చేసింది. 2024–25లో ప్రస్తుత ధరల ప్రకారం.. రాష్ట్ర, దేశీయ ఉత్పత్తి దాదాపు రూ. 16 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. ఇదే సమయంలో ఏపీలో తలసరి GSDP రూ. 2.5 లక్షలకు పైగా ఉంది. విద్యుత్ లభ్యత పరంగా.. రాష్ట్రం దాదాపు 1,500 యూనిట్ల తలసరి లభ్యతతో జాతీయ స్థాయిలో 14వ స్థానంలో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో సగటు ఆయుర్దాయం 70 సంవత్సరాలుగా నమోదైంది. పురుషుల ఆయుర్దాయం 68 సంవత్సరాలు కాగా, మహిళల ఆయుర్దాయం 73. మహిళల్లో అధిక ఆయుర్దాయాన్ని సూచిస్తుంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల దిశగా ఆంధ్రప్రదేశ్ 74 స్కోరుతో దేశంలో 10వ స్థానంలో ఉందని ఆర్బీఐ (RBI) తెలిపింది.
Read Also: తిరుమల శ్రీభూ వరాహ స్వామి ఆలయ వేళలో మార్పు
Follow Us On: Sharechat


