epaper
Monday, March 2, 2026
epaper

నేడు SPB విగ్రహావిష్కరణ.. రవీంద్రభారతిలో టెన్సన్ టెన్షన్

కలం, వెబ్ డెస్క్: ఇవాళ హైదరాబాద్ రవీంద్రభారతి(Ravindra Bharathi)లో గాన గంధర్వుడు బాలసుబ్రమణ్యం (SPB) విగ్రహావిష్కరణ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) హాజరై బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రవీంద్రభారతిలో బాలసుబ్రమణ్యం విగ్రహ ఏర్పాటు సరైంది కాదని ఉద్యమకారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఉద్యమకారుడు పృధ్వీరాజ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. తెలంగాణ (Telangana)లో ఎంతోమంది కళాకారులు, మేధావులు ఉన్నారు. వారిని కాదని బాలసుబ్రమణ్యం(SPB) పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించాడు. పోలీసులు ఎన్నిరోజులు అడ్డుపడతారో చూస్తానని తేల్చి చెప్పాడు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో పరాయి పాలన కొనసాగుతుందని, తెలంగాణ సాహిత్యాన్ని బొందపెడుతున్నారని మండిపడ్డారు. ఉద్యమకారుల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు రవీంద్రభారతిలో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. కేవలం ఎంట్రీ పాసులున్నవారికే అనుమతించనున్నట్లు తెలుస్తోంది. దీంతో నేడు  జరగబోయే  బాలసుబ్రమణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమంపై ఆందోళన నెలకొంది.

Read Also: విజన్ సరే… ఇంప్లిమెంటేషన్ ఎలా?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!