Mobile Popup Ad
Mobile Popup Ad

నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి : వ్యవసాయ అధికారి

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : ప్రస్తుత సీజన్ లో జిల్లా రైతాంగానికి సన్నారకాల లభ్యత, నాణ్యమైన విత్తనం అందుబాటులో ఉంచాలని జిల్లా (Mahabubnagar) వ్యవసాయ అధికారి బి. వెంకటేష్ విత్తనడీలర్లకు సూచించారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని రైతు శిక్షణ కేంద్రంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రాంభూపాల్ అధ్యక్షతన జిల్లా విత్తన డీలర్ల సన్నద్ధత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన వ్యవసాయ అధికారి వెంకటేష్ మాట్లాడారు.

సీడ్ నివేదిక, రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలు, స్టాక్ బోర్డు నిర్వహణ గురించి డీలర్లకు వివరించారు. పంట వ్యర్థాలు కాల్చడం వల్ల కలిగే నష్టాలు, పంటల వైవిద్యం, వివిధ పంటలు విత్తనాలు గురించి వివరించారు.. అధిక మోతాదు యూరియా వాడడం వల్ల కలిగే నష్టాల రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎరువుల బుకింగ్ యాప్ గురించి డీలర్ల సందేహాలు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో హన్వాడ, మహమ్మదాబాద్, గండీడ్ , కోయిల్కొండ మండల వ్యవసాయ అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.

Read Also: పేదలను సంతృప్తి పరిచేలా ఇండ్ల నిర్మాణాలు : మంత్రి పొంగులేటి

Read Also: పెట్రో బాదుడు పాపం తలా పిడికెడు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>