ANMల సమస్యలపై సెప్టెంబర్ 3న రాష్ట్ర వ్యాప్త ధర్నా

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ యునైటెడ్ మెడికల్, అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో వైద్య విభాగంలో పనిచేస్తున్న ఒకటవ, రెండవ , యూరోపియన్ ANM లు, అర్బన్ ANM ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సెప్టెంబర్ 3వ తేదీన మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని సీఐటీయూ తెలంగాణ (CITU Telangana) యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భూపాల్ సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ANM లపై పని వత్తిడి తగ్గించాలని, పై అధికారుల వేధింపులు ఆపాలని కోరారు. వారికి పే స్కేల్ ప్రకటించి, ఉద్యోగం పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సెలవులు ఇవ్వాలని, తదితర డిమాండ్స్‌తో ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా సీనియర్ నాయకులు కిల్లె గోపాల్, జిల్లా కార్యదర్శి కురుమూర్తి, చంద్రకాంత్, వీరాంజనేయులు, విజయ వర్ధన్ రాజు మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షులు పసియుద్దీన్, విజయ వర్ధన్ రాజు పాల్గొన్నారు. వైద్య విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ANMలు తదితర సిబ్బంది పెద్ద ఎత్తున 3వ తేదీన కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>