సెమీ కండక్టర్ హబ్‌గా తెలంగాణ: శ్రీధర్ బాబు

కలం, వెబ్ డెస్క్: సెమీ కండక్టర్ తయారీ రంగంలో తెలంగాణను పెట్టుబడుల హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా జర్మనీ కంపెనీలను ప్రోత్సహించాలని జర్మన్ ఇండియన్ బిజినెస్ అలయన్స్ ప్రతినిధులను కోరారు. జర్మనీ నగరంలోని కెల్‌స్టర్‌బాక్ నగర మేయర్ మాన్‌ఫ్రెడ్ ఓకెల్‌ నేతృత్వంలో అలయన్స్ ప్రతినిధులు సోమవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును కలిశారు.

హైదరాబాద్ నగరంలో సెమీ కండక్టర్స్, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ప్రెసిషిన్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్, ఆటోమేషన్ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అనుకూలతలను మంత్రి వారికి వివరించారు. డిసెంబర్ 7, 8, 9వ తేదీల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026’పై జర్మనీ పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించాలని ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.

పరిశ్రమలకు వేగంగా అనుమతులు..

తెలంగాణ నుంచి పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులు జారీ చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. మౌలిక వసతులు, పెట్టుబడి ప్రోత్సాహకాలు, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాల్లో పూర్తి సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. జర్మనీ కంపెనీల అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రెసిషన్ ఇంజినీరింగ్, అడ్వాన్స్డ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సామర్థ్యాలను తెలంగాణలోని టాలెంట్ పూల్, ఇండస్ట్రీ ఎకోసిస్టమ్‌తో అనుసంధానం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

రాష్ట్రం నుంచి ఎగుమతులు జర్మనీ, యూరప్ మార్కెట్లకు సులభంగా చేరేలా ప్రత్యేక లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీఐబీఏ ఛైర్మన్ సెల్వకుమార్ పెరియసామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబును కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అల్పన దూబే మర్యాదపూర్వకంగా కలిశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>