Mobile Popup Ad
Mobile Popup Ad

విజయ్ అఫిడవిట్‌లలో తేడాలు.. మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: టీవీకే అధినేత విజయ్‌కి (TVK Vijay) మరో షాక్ తగిలింది. ఎన్నికల అఫిడవిట్లలో తేడాలు ఉండటంతో మద్రాస్ హైకోర్టు (Madras High Court)  కీలక ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా విజయ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తిరుచ్చి, పెరంబూర్ ఈ రెండు స్థానాల్లో విజయ్ బరిలో ఉన్నారు. అయితే ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేసే క్రమంలో ఇచ్చిన ఆస్తుల వివరాలు వేర్వేరుగా ఉండటం గమనార్హం. టీవీకే విజయ్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల మీద పెరంబూర్‌కు చెందిన ఓ ఓటరు కోర్టును ఆశ్రయించారు. తిరుచ్చి నియోజకవర్గానికి దాఖలు చేసిన అఫిడవిట్‌లో విజయ్ తన ఆదాయం రూ.220 కోట్లు అని పేర్కొనగా, పెరంబూర్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో రూ.115 కోట్లు అని చూపించారు. రెండు అఫిడవిట్ల మధ్య రూ.105 కోట్ల తేడా ఉంది. ఇందుకు సంబంధించిన ఆధారాలను పిటిషనర్ కోర్టుకు సమర్పించారు. దీంతో కోర్టు స్పందించింది. ఈ తేడాలపై దీనిపై ఆదాయపు పన్ను శాఖ స్పందించాలని కోర్టు ఆదేశించింది.

విజయ్‌కు వరస దెబ్బలు

రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి విజయ్‌కు (Vijay) వరసగా కష్టాలు మొదలయ్యాయి. కరూర్ బహిరంగసభలో దాదాపుగా 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ ఎంక్వైరీ కొనసాగుతోంది. మరోవైపు విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇలా విజయ్‌కు వ్యక్తిగతంగా, రాజకీయంగా అనేక ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మొదట్లో విజయ్ పార్టీకి భారీగా మద్దతు దక్కుతోందని మీడియా సర్కిళ్లల్లో గుసగుసలు వినిపించాయి. సభలకు కూడా జనం భారీగా తరలివచ్చారు. కానీ ప్రస్తుతం ఆ ఊపు కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తోంది. ఒక వేళ విజయ్ ఈ ఎన్నికల్లో గెలవకపోతే పరిస్థితి ఏమిటి? అన్న చర్చ కూడా సాగుతోంది.

Read Also: తెలంగాణ జాగృతిలో భారీగా చేరికలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>