Mobile Popup Ad
Mobile Popup Ad

చిరంజీవి చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

కలం, వెబ్ డెస్క్ : ఇండస్ట్రీలో ఎవరికి ఆపద వచ్చినా.. తాను ఉన్నానంటూ స్పందించే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. శివనాథ్ అనే వ్యక్తి చిరంజీవికి కొన్ని సంవత్సరాలుగా మేకప్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నారు. ఇటీవలే గుండె సంబంధిత ఆపరేషన్ కోసం ఆయన ఆసుపత్రిలో చేరగా.. విషయం తెలుసుకున్న మెగాస్టార్ రూ.10.5 లక్షలు అందించారు. అలాగే, తన వద్ద గతంలో పనిచేసిన మాజీ మేనేజర్ నరసయ్య భార్యకు బైపాస్ సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పడంతో వెంటనే రూ.9.5 లక్షల చెక్కు పంపించారు.

కేవలం ఆర్థిక సాయం చేసి వదిలేయకుండా.. ఇద్దరికి ఆపరేషన్లు సకాలంలో జరిగేలా అన్ని రకాల ఏర్పాట్లను దగ్గరుండి చేయించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు.. తమ హీరో గొప్ప మనసును కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ ‘విశ్వంభ’ర మూవీలో నటిస్తుండగా.. ఆగస్టులో విడుదల కాబోతుంది. అలాగే, ‘వాల్తేరు వీరయ్య’ ఫేం బాబీతో మరోసారి జట్టుకట్టబోతున్నారు.

Read Also: ధనుష్ ‘కర’ తెలుగులో గ్రాండ్ రిలీజ్.. ఎప్పుడంటే!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>