కలం, వెబ్ డెస్క్ : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ (Madhu Yashki Goud) సతీమణి సుచి యాష్కీ (Suchi Yashki) ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ జరిగింది. సుచి యాష్కీకి తీవ్ర గాయాలవడంతో పాటు పక్కెటెముకలు విరిగినట్లు వైద్యులు వెల్లడించారు. కుమార్తె డాక్టర్ గగన యాష్కీని ఎండీ కోర్సులో జాయిన్ చేసి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. బోస్టన్ నుంచి న్యూయార్క్‌కు వస్తుండగా వర్షం కారణంగా కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది.
లగేజీ ఎక్కువగా ఉండటంతో మధుయాష్కీగౌడ్, సుచి యాష్కీ వేర్వేరు కార్లలో ప్రయాణం చేస్తున్నారు. దీంతో మధుయాష్కీ గౌడ్ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న సుచి యాష్కీ కొలుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. రేపు ఇండియాకు తిరిగి రావాల్సి ఉండగా ప్రమాదం జరగడం గమనార్హం. కాగా, సుచియాష్కి అక్కడ సీనియర్ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

