కలం, వెబ్ డెస్క్ : పల్నాడు జిల్లా మాచర్ల (Macherla)లో ప్రభుత్వ ఉద్యోగినిపై జరిగిన అత్యాచార ఘటనలో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడని బాధితురాలు తొలుత చెప్పినప్పటికీ, విచారణలో అది స్నాప్‌చాట్ ద్వారా పరిచయమైన వ్యక్తి చేసిన ఘాతుకమని తేలింది. ఈ కేసులో రాజుపాలెం మండలానికి చెందిన నామాల శ్రీనివాస్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచర్లలోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా పని చేస్తున్న మహిళకు, నిందితుడు శ్రీనివాస్‌తో స్నాప్‌చాట్ (Snapchat) ద్వారా పరిచయం ఏర్పడింది. గతంలో రెండు వివాహాలై విడాకులు తీసుకున్న సదరు మహిళ ప్రస్తుతం ఒంటరిగా నివసిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 2వ తేదీన ఆమె తన ఇంటి గూగుల్ మ్యాప్స్ లొకేషన్‌ను శ్రీనివాస్‌కు పంపి ఇంటికి ఆహ్వానించింది.
అయితే ఇంటికి వచ్చిన శ్రీనివాస్ ఆమెపై అఘాయిత్యం చేయబోగా, బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహానికి గురైన నిందితుడు ఆమె కాళ్లు, చేతులు కట్టేసి, దాడి చేసి అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తనకు తెలిసిన వ్యక్తే ఈ పని చేయడంతో అవమాన భారంతో బాధితురాలు పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి నీళ్లు అడగడానికి వచ్చి తనపై దాడి చేశాడని, తనకు ఎయిడ్స్ ఉందని చెప్పినా వినకుండా అఘాయిత్యం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.
పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, బాధితురాలి ఫోన్ కాల్ డేటాను విశ్లేషించగా అసలు నిజం బయటపడింది. స్నాప్‌చాట్ స్నేహితుడే ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించి, ఈ నెల 8వ తేదీన మాచర్ల (Macherla) రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.
Read Also: షర్మిల కూటమి పార్టీల దత్తపుత్రిక: ఆర్కే రోజా
Follow Us On: Instagram

