కలం, వెబ్ డెస్క్ : వంటగ్యాస్ (LPG cylinder) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. నిత్యవసర ధరల భారంతో సతమతమవుతున్న సామాన్య ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ బాంబు పేల్చింది. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ తో పాటు కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా పెంచిన ధరల ప్రకారం 14.2 కిలోల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై 60 రూపాయలు పెరగగా, 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై ఏకంగా 115 రూపాయల భారం పడింది.
హైదరాబాద్ నగరంలో ఈ ధరల ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు 905 రూపాయలుగా ఉన్న 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ (LPG Cylinder) ధర ఈ పెంపుతో 965 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర 1,961 రూపాయల నుంచి 2,076 రూపాయలకు పెరిగింది. సవరించిన ఈ కొత్త ధరలు నేటి నుంచే అమలులోకి రావడంతో అటు సామాన్యులు, ఇటు వ్యాపార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం వల్ల హోటల్ ధరలతో పాటు మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
Read Also: మరోసారి ఆస్కార్ అవార్డుల వేడుకకు ప్రియాంకా చోప్రా!
Follow Us On: Youtube

