కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Batti Vikramarka) 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర పద్దును ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు, మూలధన వ్యయం – రూ.47,267 కోట్లుగా వెల్లడించారు. అయితే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ‘ఆరు గ్యారంటీల’ (Six Guarantees) అమలుకు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కేటాయింపులపై తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఈ బడ్జెట్‌లో ఆరు గ్యారంటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.50, 713 కోట్లు కేటాయించింది.
ఇదిలాఉంటే గత ఏడాది ఆరు గ్యారంటీల అమలుకు బడ్జెట్‌లో రూ.56,084 కోట్లు కేటాయించారు. అయితే ఈసారి మాత్రం రూ.50,713 కోట్లు మాత్రమే నిధులు కేటాయించారు. తద్వారా ఆరు గ్యారంటీల అమలుకు రూ.5,371 కోట్ల మేర నిధులు తక్కువగా కేటాయించారు. దీంతో ఆరు గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ అంశాన్నే విస్మరించిందని ప్రతిపక్షాలు విరుచుకుపడే వీలుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రతిపక్షాలు ఈ కేటాయింపుపై విమర్శలకు రెడీ అవుతున్నాయని సమాచారం అందుతోంది.
Read Also: షాకింగ్.. భారత్ లో భారీగా పెరిగిన పవర్ పెట్రోల్ ధరలు
Follow Us On: Instagram

