ఇరాన్‌లో బహిరంగంగా ముగ్గురికి ఉరిశిక్ష

కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ వైపు అమెరికా, ఇజ్రాయెల్ తో యుద్ధం చేస్తూనే ఇరాన్ (Iran) తన దేశంలో కఠిన శిక్షలను అమలు చేస్తోంది. తాజాగా ముగ్గురు వ్యక్తులను బహిరంగంగా ఉరితీసింది ఇరాన్. ఇందులో ఓ రెజ్లర్ కూడా ఉన్నాడు. గతేడాది డిసెంబర్ లో ఇరాన్ లో (Iran) తీవ్ర స్థాయిలో అల్లర్లు జరిగాయి. ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, నిరుద్యోగానికి వ్యతిరేకంగా లక్షల మంది రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారు. ఆ సమయంలో నిరసన కారులపై పోలీసులు కాల్పులు జరిపారు.

ఈ కాల్పులను వ్యతిరేకిస్తూ నిరసన కారులు దాడులు చేయగా.. కొందరు పోలీసులు మరణించారు. ఈ ఘటనలో కొందరు నిరసనకారులను ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. ఆ కేసుపై విచారణ ఇంకా జరుగుతుండగా.. ఇందులో ముగ్గురికి తాజాగా ఉరిశిక్ష విధించి దాన్ని అమలు చేసింది ఇరాన్. ఇందులో 19 ఏళ్ల రెజ్లర్ సలేహ్ మొహమ్మది, సయీద్ దావోది, మెహ్ది ఘసెమి ఉన్నారు. ఈ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>