Mobile Popup Ad
Mobile Popup Ad

‘రాజు వెడ్స్ రాంబాయి’ సీన్ రిపీట్.. యువతి సూసైడ్..!

కలం, వెబ్ డెస్క్ : ఇటీవల వచ్చిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ సీన్ ను రిపీట్ చేస్తూ ఓ ప్రేమోన్మాది చేసిన ఘాతుకానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఆ సినిమాలో తండ్రి కూతురికి HIV ఇంజెక్షన్ ఇస్తే.. ఇక్కడ ప్రేమ పేరుతో వేధిస్తున్న ఓ యువకుడు యువతికి ఇంజెక్షన్ ఇచ్చాడు. మేడ్చల్ (Medchal) జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. అన్నోజిగూడకు చెందిన 24 ఏళ్ల రమణి అనే యువతికి మనోహర్ అనే యువకుడితో పరిచయం ఉంది. దీంతో మనోహర్ ఆమె దగ్గర పెళ్​లి ప్రస్తావన తీసుకురాగా.. దానిని ఆమె సున్నితంగా తిరస్కరించింది. ఈ క్రమంలోనే గత నెల 11న ఇద్దరి మధ్య తలెత్తింది. తనను కాదన్న కోపంతో మనోహర్ యువతిపై దాడి చేయడమే కాకుండా ఆమె శరీరంలోకి HIV సోకిన రక్తాన్ని ఇంజెక్షన్ చేసినట్లు ఆరోపణలువచ్చాయి.

ఈ భయంకరమైన ఘటన తర్వాత రమణి తీవ్ర భయాందోళనకు గురైంది. తన ఆరోగ్యానికి ఏమవుతుందోన్న ఆందోళన, సమాజంలో ఎలా బతకాలన్న మానసిక ఒత్తిడితో కుంగిపోతున్న రమణి.. కొద్ది కాలంగా ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకుండా ఒంటిరిగా ఉంటుంది.తాజాగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఘట్ కేసర్ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తేల్చారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు మనోహర్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: కేసీఆర్‌ను కలిసి భావోద్వేగానికి గురైన జీవన్ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>