Mobile Popup Ad
Mobile Popup Ad

టీవీకే విజయ్ రోడ్‌ షో లో అపశృతి.. ఫ్యాన్స్‌కు యాక్సిడెంట్

కలం, వెబ్‌డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలన్నీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగా టీవీకే (TVK) పార్టీ అధినేత, నటుడు దళపతి విజయ్ (Vijay) కూడా తనదైన శైలిలో క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. అయితే, విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఆయన నిర్వహించిన మీటింగుల్లో, ర్యాలీల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విజయ్ రోడ్ షోలో మరో యాక్సిడెంట్ చోటు చేసుకుంది. శుక్రవారం శివగంగ ప్రాంతంలోని కరైకూడిలో విజయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో రోడ్ షో లో భాగంగా విజయ్ కాన్వాయ్ లో ఫ్యాన్స్ బైక్స్ తో భారీగా పాల్గొన్నారు. అయితే, విజయ్ వాహనం వెనుక వస్తున్న ఓ అభిమాని ద్విచక్ర వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రంగా అయినట్లు తెలుస్తోంది.  యాక్సిడెంట్ దృశ్యాలు వాహనాల ముందు వస్తున్న కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సీన్ రిపీట్.. యువతి సూసైడ్..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>