Mobile Popup Ad
Mobile Popup Ad

తీవ్ర విషాదం.. పురుగుమందు తాగి ప్రేమజంట సూసైడ్

కలం, వెబ్ డెస్క్: పల్నాడు (Palnadu) జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు కోటలో అత్యంత విషాదకర ఘటన జరిగింది. ప్రేమజంట పురుగుల మందుతాగి ఆత్మహత్య (couple suicide) చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో వివాహం జరగడంతో విడిపోయి ఉండలేమన్న బాధతో ఇద్దరు ప్రేమికులు సూసైడ్ చేసుకున్నారు. ఈ మేరకు స్థానిక పోలీసులు వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా స్వర్ణభారత్‌ నగర్‌కు చెందిన రసిక మనికంఠ రాజు (20), అంకమ్మ నగర్‌కు చెందిన ఓ యువతి ప్రేమలో పడ్డారు. గత రెండేళ్లుగా వీరివివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో యువతికి, ఆమె తల్లిదండ్రులు ఇటీవల మరో వ్యక్తితో పెళ్లి చేశారు. వివాహం తర్వాత మనస్తాపానికి గురైన సదరు యువతి.. భర్తతో ఉండలేనని చెప్పి గుంటూరుకు తిరిగి వచ్చేసింది.

ఈ క్రమంలోనే ఈ నెల 7వ తేదీన మనికంఠ రాజు, సదరు యువతి కొండవీడు కోటకు వెళ్లారు. అక్కడ వారు ‘స్పైకర్‌’ అనే పురుగుమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనిని గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌ ద్వారా వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మనికంఠ రాజు 8వ తేదీ సాయంత్రం మృతి చెందాడు. పరిస్థితి విషమించి 9వ తేదీన యువతి చనిపోయింది. వీరి మృతితో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కొండవీడు కోట వంటి పర్యాటక ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుల ఇద్దరి తల్లులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ టి శివరామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజు మృతదేహానికి గురువారం పోస్టు మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. యువతి మృతదేహానికి శుక్రవారం పోస్టు మార్టం నిర్వహించనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Read Also: ‘రాకా’ కోసం దీపికా పదుకొణె కళ్లు చెదిరే రెమ్యూనరేషన్​

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>