Mobile Popup Ad
Mobile Popup Ad

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోదీ సర్‌ప్రైజ్

కలం, వెబ్ డెస్క్: పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)  సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఓ చిన్న దుకాణానికి వెళ్లి 10 రూపాయలు ఇచ్చి ఝల్మూరి అనే ఒక వెరైటీ స్నాక్ రుచి చూశారు. మేదినీపూర్ జిల్లా ఝార్‌గ్రామ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. స్వయంగా జేబులోంచి పది రూపాయల నోటు ఇచ్చి తినుబండారాన్ని కొనుగోలు చేశారు ప్రధాని. దుకాణాదారుడు డబ్బులు తీసుకోడానికి నిరాకరించినా బలవంతంగానే అతడి చేతిలో పెట్టారు. ఝార్‌గ్రామ్‌లో నాలుగు ర్యాలీల్లో పాల్గొన్న సందర్భంగా మార్గమధ్యంలో కార్యకర్తలు కూడా ఊహించని విధంగా దుకాణానికి వెళ్లి ఆ స్నాక్ కొనుక్కొని రుచిచూశారు. ఇదంతా ఎన్నికల స్టంట్ అని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

Read Also: ట్రంప్ కు హౌతీల హెచ్చరిక.. ప్రపంచ దేశాలకు ముప్పు..!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>