Mobile Popup Ad
Mobile Popup Ad

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వడగళ్ల వర్షం.. తడిసిన ధాన్యం

కలం, నిజామాబాద్ బ్యూరో : అకాల వర్షాలు అన్నదాతలను వెంటాడుతున్నాయి. నిజామాబాద్ (Nizamabad), కామారెడ్డి జిల్లాల్లో ఆదివారం సాయంత్రం భారీ ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది.. అనేక మండలాల్లో భారీ వడగండ్లు కురిశాయి. గత వారం పది రోజుల్లో అకాల వర్షాలు కురవడం ఇది మూడోసారి. ఈసారి కూడా భారీగా పంట నష్టం వాటిల్లింది.. చేతికొచ్చిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల్లో సైతం ధాన్యం తడిసింది. చాలా చోట్ల కోతకు వచ్చిన వరి పంటలో వడ్లు నేల రాలిపోయాయి. వరి పైర్లు నేల వాలాయి. మామిడి కాయలు భారీగా రాలిపోయాయి. పలు చోట్ల కొనుగోలు కేంద్రాల్లో సైతం ధాన్యం వర్షంతో కొట్టుకుపోయింది.. రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లింది.. వరుసగా అకాల వర్షాలు కురుస్తుండటంతో రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Read Also: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోదీ సర్‌ప్రైజ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>