కలం, వెబ్ డెస్క్ : శ్రీకృష్ణుడు, హనుమంతుడు గొప్ప దౌత్యవేత్తలని కేంద్ర విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ (Jai Shankar) అన్నారు. పుణేలో నిర్వహించిన పుస్తక మహోత్సవ వేడుకకు హాజరై ప్రసంగించారు. భారత్ కు వ్యూహాత్మక రాజకీయాలు, రాజ్య నిర్వహణ తెలియదని విదేశీ రచయితల వ్యాఖ్యలపై విసిగిపోయాయన్నారు. రామాయణం, మహాభారతంలోని పాలనా విధానాలు, రాజకీయ వ్యూహాలను ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచంలో శ్రీకృష్ణుడు, హనుమంతుడు కంటే గొప్ప దౌత్యవేత్తలు లేరని తాను అభిప్రాయపడుతున్నానని చెప్పారు. అయోధ్య నుంచి లంకకు వెళ్లి సీతమ్మకు భరోసానిచ్చి.. రావణుడికి వణుకు పుట్టించారని కొనియాడారు. అలాగే, మహాభారత యుద్ధ కాలంలో శ్రీ కృష్ణుడు చేసిన రాయబారాన్ని కేంద్ర మంత్రి Jai Shankar గుర్తు చేశారు.


