కలం, కరీంనగర్ బ్యూరో: ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని (Prajavani Program ) రద్దు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ లు, వార్డు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయా జిల్లా కలెక్టర్లు జిల్లాల వారిగా పత్రిక ప్రకటన విడుదల చేశారు.


