కలం, వెబ్ డెస్క్: అమరావతి చట్టబద్ధత బిల్లు (Amaravati Bill)కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అమరావతి చట్టబద్దత బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ పోస్ట్ ఫ్యాక్టో ర్యాటిఫికేషన్ చేయనుంది. అనంతరం రాష్ట్రపతి ఆమోదానికి బిల్లును పంపనున్నారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన తరువాత కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. తొలుత ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ (Minister Nityanand Rai) ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఈ బిల్లుపై చర్చ జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వైసీపీ, సమాజ్‌వాదీ సహా పలు పార్టీల ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. సుమారు సుమారు రెండు గంటలపాటు చర్చ జరిగిన తర్వాత లోక్ సభలో బిల్లు ఆమోదం పొందింది.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014ను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం అమరావతి చట్టబద్దత బిల్లును (Amaravati Bill) ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ద్వారా అమరావతిని ఏపీ ఏకైక, శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేశారు. జూన్ 2, 2024 నుండి ఈ సవరణ అమల్లోకి వచ్చేలా నిబంధనలు చేర్చారు. అయితే ఈ బిల్లుపై చర్చలో ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఏపీ అభివృద్ధి కోసం అమరావతిని శాశ్వత రాజధానిగా తాము మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నామని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్, టీడీపి సభ్యులు ఈ బిల్లును చారిత్రాత్మకమైనదిగా పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ సభ నుండి వాకౌట్ చేసింది.
Read Also: అమరావతిపై వైసీపీ మూడు ముక్కలాట ఆడింది: పెమ్మసాని
Follow Us On : WhatsApp

