కలం, వెబ్ డెస్క్: లోక్ సభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై (Amaravati Bill) చర్చ సందర్భంగా ప్రతిపక్ష వైసీపీపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో అమరావతిపై మూడు ముక్కలాట ఆడిందని ఫైర్ అయ్యారు. అమరావతి నిర్మాణం చేయకుండా ఐదేళ్ల విలువైన కాలాన్ని వృథా చేసి, రైతులు మహిళలను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని ముందుకు తీసుకెళ్తామని జగన్ (YS Jagan) పాదయాత్రలో చెప్పారని.. కానీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అంటూ చిచ్చు పెట్టారని దుయ్యబట్టారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పేరుతో రాజధాని మహిళలు యాత్ర చేపడితే వేధించారని మండిపడ్డారు. మహిళా రైతులను మేకులు ఏర్పాటు చేసిన లాఠీలతో జగన్ కొట్టించారని అన్నారు.
అమరావతి బిల్లుపై లోక్‌సభలో తెలుగులో పెమ్మసాని (Pemmasani) మాట్లాడారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు, మహిళలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అమరావతి అనేది ఓ పవిత్ర భూమి అని పేర్కొన్నారు. చంద్రబాబు అంటే శక్తి, వ్యక్తి, ఒక నమ్మకమని.. చంద్రబాబును నమ్మి రైతులు ముందుకొచ్చి భూములు ఇచ్చారని తెలిపారు. అమరావతి బిడ్డగా ఈ సభలో ప్రసంగించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. రైతుల స్వచ్చంద భాగస్వామ్యంతో 34వేల ఎకరాల భూమిని సేకరించి అమరావతి అభివృద్ధికి అంకురార్పణ చేసిన శక్తి, వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. రాజధానిని నిర్ణయించడం, మార్చడం అసెంబ్లీ పరిధిలోకి రావని స్పష్టం చేశారు. ఆ అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందని చెప్పారు.
Read Also: పెట్రోల్ ట్యాంకర్ల నుంచి మంటలు..
Follow Us On: Instagram

