లోక్​సభ రేపటికి వాయిదా

కలం, వెబ్​ డెస్క్​: తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య లోక్​సభ(Lok Sabha) రేపటికి వాయిదా పడింది. బడ్జెట్​పై రెండో దఫా చర్చల్లో భాగంగా సోమవారం సమావేశమైన సభ పలుసార్లు వాయిదా అనంతరం మంగళవారానికి వాయిదా పడింది. పశ్చిమాసియా యుద్ధంపై చర్చకు విపక్షాలు పట్టు పట్టడంతో సభ ప్రారంభమైన కాసేపటికే గందరగోళం నెలకొంది. దీనిపై విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్​ ప్రకటన చేస్తుండగా, పూర్తి స్థాయిలో చర్చ జరగగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీనిపై సమాధానం రాకపోవడంతో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు.

దీంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష సభ్యులు వెల్​లోకి దూసుకెళ్లి, ప్లకార్డులతో నిరసన తెలపడంతో సభ పలుసార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో మధ్యాహ్నం 3.30గంటలకు సభను (Lok Sabha) రేపటికి వాయిదా వేస్తూ స్పీకర్​ ప్రకటించారు. రేపు ఉదయం 11గంటలకు సభ సమావేశం కానుంది. పశ్చిమాసియా యుద్ధంతోపాటు, స్పీకర్ ఓం బిర్లా (Om Birla) తొలగింపు తీర్మానంపైనా రేపు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Read Also: సీఎంఆర్ ఎగవేత కేసులో యాక్షన్ స్టార్ట్

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>