డైనోసార్ గుడ్లు లభ్యం.. ఎన్నేళ్ల క్రితం నాటివి అంటే..

కలం, వెబ్ డెస్క్ : డైనోసార్‌ (Dinosaur) లు సినిమాల్లో, మ్యూజియాల్లో తప్ప ఎక్కడా కనిపించని జీవులు. అసలు డైనోసార్‌లు కల్పితం అని వాదించేవారు కూడా ఇప్పటికీ కొందరు ఉన్నారు. అయితే తాజాగా డైనోసార్‌లకు సంబంధించి శాస్త్రవేత్తలు ఆశ్చర్యం కలిగించే విషయాన్ని కనుగొన్నారు. పోర్చుగల్‌లోని టోర్రెస్ వేడ్రాస్ నేచురల్ హిస్టరీ సొసైటీకి చెందిన పరిశోధకుడు కార్లోస్ నటారియో ఈ అరుదైన ఆవిష్కరణ చేశారు. 150 మిలియన్ ఏళ్ల నాటి 10 డైనోసార్ గుడ్ల గూడును పోర్చుగల్‌ (Portugal) లోని శాంటా క్రజ్ బీచ్ కొండల్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. లిస్బన్ జిల్లా టోర్రెస్ వెద్రాస్ ప్రాంతం సాంటా క్రూజ్ బీచ్ కొండల వద్ద 10 డైనోసార్ గుడ్లు లభించాయి. ఈ అరుదైన ఆవిష్కరణ శాస్త్రవేత్తల్లో ఆసక్తి రేపుతోంది.

సాధారణంగా డైనోసార్‌లు  భూమిపై సుమారు 66 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ గుడ్లు జురాసిక్ యుగానికి చెందినవిగా భావిస్తున్నారు. ఈ గూడును పరిశోధకుడు కార్లోస్ నటారియో గుర్తించారు. ఆయన టోర్రెస్ వెద్రాస్ నేచురల్ హిస్టరీ సొసైటీకి చెందిన ప్యాలియో బయాలజీ పరిశోధనా కేంద్రంలో పనిచేస్తున్నారు. మొదటి పరిశీలనలలో  గుడ్లలో ఉన్న పిల్లలు చాలా కాలం క్రితమే బయటకు వచ్చి ఉండొచ్చని అంచనా వేశారు. కొన్ని గుడ్లలో పిండాల ఆనవాళ్లు ఉండే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు.

సాంటా క్రూజ్ బీచ్ కొండల్లో కనిపించిన ఈ గూడు అప్‌పర్ జురాసిక్ కాలానికి చెందినదిగా గుర్తించారు. గుడ్లు సహజ గూడు ఆకారంలోనే ఉండటం ముఖ్య అంశంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి వరదలు లేదా ఇతర ప్రకృతి విపత్తుల వల్ల కదలలేదని భావిస్తున్నారు. ఈ గుడ్లు సన్నని ఇసుక రాతిలో కనిపించాయి. దీంతో ఆ కాలంలో డైనోసార్ నది తీరంలో గుడ్లు పెట్టి ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇసుక మట్టిలో గుడ్లు సహజంగా కప్పబడి కాలక్రమంలో శిలాజాలుగా మారినట్లు భావిస్తున్నారు.

Read Also: రోజూ తలనొప్పి వస్తుందా.. డిజిటల్ స్క్రీన్లే కారణం..!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>