ప‌రీక్ష‌ల సంస్క‌ర‌ణ‌ల‌పై మోదీ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: దేశంలో ప‌రీక్ష‌ల సంస్క‌ర‌ణ‌ల‌ (Exam Reforms) పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇన్​ఫోసిస్ కో ఫౌండర్​ నందన్​ నీలేకని ఆధ్వర్యంలో హై ప‌వ‌ర్డ్ టాస్క్ ఫోర్స్ (High Powered Task Force) ఏర్పాటు చేసింది. ఈ విష‌యాన్ని ప్ర‌ధాని మోదీ త‌న ఎక్స్ ఖాతా వేదిక‌గా వెల్ల‌డించారు. పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతతో పాటు అక్రమాల నివారణే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోదీ వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మన దేశంలో పరీక్షల విధానం మరింత పారదర్శకంగా, సాంకేతికత పరిజ్ఞానంతో ఉండాల్సిన అవసరం ఉండాలన్నారు. అందుకే ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్​  నీలేకని ఆధ్వర్యంలో టాస్క్​ ఫోర్స్​ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నీలేకని ఇచ్చే నివేదిక ఆధారంగా తగిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. వేగవంతమైన విచారణ కోసం ఫాస్ట్​ ట్రాక్​ కోర్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రేపు మరింత కఠినమైన చట్టాన్ని పార్లమెంట్​ ముందుకు తీసుకొస్తున్నామని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని మోదీ అన్నారు. ఎవరైతే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారో వారు జైళ్లలో మగ్గుతున్నారని చెప్పారు.

ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు..

ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో విడుదల చేసిన కాసేపటికే.. ఉన్నత స్థాయి కమిటీని ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో నందన్ నీలేకని ఛైర్మన్ కాగా, అయిదుగురు సభ్యులుగా ఉన్నారు.

1. నందన్ నిలేకని, టెక్నాలజీ నిపుణుడు
2. ఎస్.సోమనాథ్, ఇస్రో మాజీ ఛైర్మన్
3. తపన్ డేకా, మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్
4. వి.కామకోటి, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్
5. అనితా కర్వాల్, మాజీ విద్యా శాఖ కార్యదర్శి
6. అమృత్ లాల్ మీనా, లాజిస్టిక్స్ నిపుణుడు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>