కలం, వెబ్ డెస్క్: పేపర్ లీకేజీ కారణంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు ఆందోళన చేసినా మోదీ పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. ఎప్పుడైతే.. ప్రధాని మోదీనే తప్పుకోవాలనే డిమాండ్ ఊపందుకుందో.. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జాతీయ మీడియాతో తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్రం పూర్తిగా విఫలం..
సీబీఎస్, నీట్ లాంటి పరీక్షలను సరిగ్గా నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇంకా ఎన్నో పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలే అందుకు నిదర్శనమని మండిపడ్డారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినందున, మిగిలిన రెండు డిమాండ్లు కూడా నెరవేర్చాలన్నారు. పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించడం, బాధిత కుటుంబాలకు త్వరగా పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

