ఆరు గ్యారెంటీలపై ప్రైవేట్ బిల్లు పెడుతాం : కేటీఆర్

కలం, వెబ్ డెస్క్ : రాబోయే బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ప్రైవేట్ బిల్లు పెడుతామని కేటీఆర్ (KTR) ప్రకటించారు. దాన్ని పాస్ చేయించుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆరు గ్యారెంటీలకు చట్టం చేస్తామని గతంలో రాహుల్ గాంధీ చెప్పారని.. కానీ చేయకుండా తప్పించుకుంటున్నారు కాబట్టి ఆ పని తామే చేస్తామన్నారు కేటీఆర్. తాజాగా ఆయన సిరిసిల్ల (Sircilla) నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘నేను మంత్రిగా ఉన్నప్పుడు సిరిసిల్ల అభివృద్ధి కోసం రూ.44 కోట్లు మంజూరు చేశాను. కానీ కాంగ్రెస్ దాన్ని రద్దు చేసింది. నేను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గానికి అన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఆ నిధులను రేవంత్ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ప్రజల మనసు గెలవాలంటే మంచి పనులు చేయాలి. నేను రూ.40 కోట్లు ఇస్తే.. మీరు రూ.80 కోట్లు ఇవ్వండి. నేను రెండు పనులు చేస్తే మీరు నాలుగు పనులు చేయండి’ అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు.

కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయట్లేదని.. కాబట్టి బడ్జెట్ లో వాటికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. రాబోయే బడ్జెట్ లో యూత్ కు ఉద్యోగాల విషయంలో క్లారిటీ ఇవ్వాలని చెప్పారు. ‘కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాపై బురద జల్లడమే పనిగా పెట్టుకుంది. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయొద్దు. మీరు ఇచ్చిన హామీలపై, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టండి. ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం కోసం కాదు’ అన్నారు కేటీఆర్ (KTR).

Read Also: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక మలుపు: కవితకు హైకోర్టు నోటీసులు!

Follow Us On: Youtube

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>