మద్యం ప్రియులకు వార్​ షాక్​

కలం, తెలంగాణ బ్యూరో: ముందున్న కాలమంతా పీక్ సమ్మర్! మద్యం ప్రియులకు ఇరాన్ వార్‌‌తో షాక్ తగలనుంది. ఇప్పటికే భారీగా పెరిగిన లిక్కర్, బీర్ రేట్లు (Liquor and Beer Prices).. మరింత పెరిగేలా ఉన్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా అటు ప్లాస్టిక్ బాటిళ్లు, మూతలు, ప్యాకేజింగ్ మెటీరియల్ ధరలే కాకుండా బీర్ బాటిళ్ల ధరలూ పెరుగుతున్నాయి. తయారీ ఖర్చు భారంగా మారిందంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బేవరేజెస్ కంపెనీల సమాఖ్య లేఖలు రాసింది. కనీసంగా 15% మేర మద్యం రేట్లను పెంచుకునే వెసులుబాటు కల్పిస్తే తప్ప గట్టెక్కలేమని తేల్చి చెప్పాయి. ఇదే జరిగితే.. బ్రాందీ, విస్కీపై కనిష్ట స్థాయిలో 20 రూపాయలు, బీర్ పైన పది రూపాయలు పెరిగే అవకాశాలున్నాయి.

మద్యం అమ్మకాల్లో దేశంలోనే తెలంగాణ టాప్. రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే వనరుల్లో ఎక్సైజ్​ శాఖ ముందు వరుసలో ఉన్నది. రాష్ట్రంలో బీరుకు ఎప్పుడూ ఫుల్ డిమాండ్. ఎండాకాలంలో రెండు మూడింతలు ఎక్కువగానే బీర్ సేల్స్ ఉంటాయి. ప్రస్తుతం సమ్మర్ సీజన్‌‌లో మద్యం దుకాణాల్లో బీర్లకే భారీ గిరాకీ ఉంది. ఎండలు ఇంకా ముదిరితే సేల్స్ మరింత పెరుగుతాయి. అందుకే డిమాండ్‌‌కు తగినట్లుగా వైన్ షాప్స్ స్టాక్ పెంచుకుంటూ ఉంటాయి. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో బీరుపై రూ. 20 పెంచింది. బ్రాందీ, విస్కీ పైనా అదే స్థాయిలో పెంచింది. ఇప్పుడు యుద్ధం ఎఫెక్ట్‌తో మరోసారి వాటి రేట్లు పెరిగే అవకాశాలున్నాయి. యుద్ధం, దాని ప్రభావం తెలిసి కొందరు మద్యం ప్రియులు ఇప్పుడే ముందుచూపుతో అదనంగా మందు కేసులను కొని నిల్వ చేసుకుంటున్నారు. కొన్ని వైన్ షాపులు సైతం దూరదృష్టితో ‘నో స్టాక్’ పేరుతో బ్లాక్ చేసి పెట్టుకుంటున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

మద్యం రేట్లను పెంచాలని బేవరేజెస్ కంపెనీల సమాఖ్య కోరడం వెనుక కారణాలేంటి? రేట్లు పెంచకపోతే గిట్టుబాటు కాదన్న డిమాండ్‌‌కు ప్రభుత్వాలు ఓకే చెప్తాయా? లేదంటే కంపెనీలు ఉత్పత్తిని తగ్గించుకుంటాయా? అదే జరిగితే మార్కెట్‌లో లిక్కర్ షార్టేజీ తప్పదా? ఇరాన్ వార్ వడ్డిస్తున్న రేట్ల ప్రభావం లిక్కర్ మీద పడితే ఎంత మేర ఆ ధరలు పెరగొచ్చు..? అసలు లిక్కర్ తయారీకి అయ్యే ఖర్చు ఎంత? అది వినియోగదారుడి చేతిలోకి వచ్చే సరికి ఎంత పెరుగుతుంది? వీటన్నింటిపై కలం 360 డిగ్రీస్ స్పెషల్ పేజ్ చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Liquor and Beer Prices
Liquor and Beer Prices

Read Also: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ స్టాండ్ ఇదే..!

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>