కలం, వెబ్ డెస్క్ : అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన ఆయన ఫలక్ నూమా ప్యాలెస్ కు బయల్దేరారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఫలక్ నూమా ప్యాలెస్ వెళ్లారు. మెస్సీని కలిసేందుకు 250 మందికి నిర్వాహకులు అనుమతి ఇచ్చారు. ఆయనను కలవాలంటే క్యూఆర్ కోడ్ తప్పని సరిగా ఉండాలి. ఫలక్ నూమా ప్యాలెస్ నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి 100 మందికి అవకాశం ఉంది. ఈ వందమంది ఫుట్ బాల్ దిగ్గజంతో ఫోటో దిగే ఛాన్స్ కొట్టేశారు. మెస్సీ రాకతో పోలీసులు ప్యాలెస్ వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
Read Also: మెస్సీ టూర్ ఏర్పాట్లపై గవర్నర్ ఫైర్.. ఈవెంట్ ఆర్గనైజర్ అరెస్ట్
Follow Us On: Pinterest


