కలం, వెబ్ డెస్క్: Local Elections – Pawan Kalyan | ఏపీలో స్థానిక ఎన్నికల సీజన్ అతి త్వరలో ప్రారంభం కానుంది. సంక్రాంతి తర్వాత ఎన్నికలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుతల వారీగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు దశలవారీగా జరుగుతాయి. లోకల్ ఎలక్షన్స్ సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాలపై ఫోకస్ చేశాయి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు 80 శాతానికిపైగా స్థానిక స్థానాలున్నాయి. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ వాటిని దక్కించుకుంది.
ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉండటంతో స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. టీడీపీతోపాటు జనసేన, బీజేపీలు బరిలో దిగబోతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు జనసేన పార్టీకి మంచి బూస్ట్ ఇవ్వనున్నాయి. ఎందుకంటే ఆ పార్టీకి గ్రామస్థాయిలో బలమైన క్యాడర్, నాయకత్వం లేకపోవడమే కారణం. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా స్థానిక పోరులోనూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సత్తా చాటాలని భావిస్తున్నారు. తన గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖను వ్యూహాత్మకంగా ఉపయోగిస్తున్నారు.
గ్రామస్థాయి పనులకు ఆయన నిధులు కేటాయిస్తుండటంతో కిందిస్థాయి నేతలు ప్రభావితమవుతున్నారు. ఫలితంగా ఇతర పార్టీల నాయకులు జనసేన వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో వైసీపీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు జనసేన వైపు మళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పవన్ నిధుల కేటాయింపులో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఫలితంగా గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా స్థానిక పోరులో జనసేన కీలక స్థానాలను దక్కించుకునే అవకాశాలున్నాయి.
Read Also: అఖండ-2 పైరసీ.. సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్
Follow Us On: X(Twitter)


